17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రాజీ మార్గమే రాజమార్గం

29-05-2025 04:36 PM

అందరికీ న్యాయం.. అందుబాటులో న్యాయం.. 

చౌటుప్పల్ (విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్ & చెక్ బౌన్స్ కేసుల పరిష్కార ప్రత్యేక లోక్ అదాలత్(Lok Adalatయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి(Junior Civil Judge Mahati Vaishnavi) ఈరోజు చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ వారితో సమావేశం నిర్వహించి చౌటుప్పల్ కోర్టు ప్రాంగణములలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ బెంచీ 14.6.2025 వరకు ప్రతీరోజు నిర్వహించబడును అని తెలుపుతూ దానికి తగు సూచనలు చేస్తూ దానికి తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని ఆదేశించారు.

రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ట్రాఫిక్ చలనా కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఎక్సెజ్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు & కోర్టు వరకు రాకుండా ఉన్న బ్యాంకు, చిట్ ఫండ్, టెలిఫోన్ సంస్థల బాకీ వివాదాలు ప్రి లిటిగేషన్ కేసులుగా, పెండింగులో ఉన్న కేసులును కూడా పరిష్కరించుకోవచ్చును. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలిపారు.