30 June, 2026 | 11:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పెండింగ్ పీఆర్సీ విడుదల చేయాలి

18-04-2026 12:38 AM

కొల్లాపూర్ టౌన్ , ఏప్రిల్ 17: ఉద్యోగుల పెండింగ్ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జీకే వెంకటేష్ మాట్లాడుతూ 2023 నుంచి పీఆర్సీ పెండింగ్లో ఉందని, టీఏలు పెరుగుతున్నప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో బాన్సులాల్కు వినతిపత్రం అందజేశారు.