వల్లపురం శ్రీ మల్లికార్జున స్వామి అభివృద్ధికి రూ.3.23 కోట్ల నిధులు మంజూరు
నిధులు మంజూరు పట్ల బట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు
ముదిగొండ/ఖమ్మం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ముదిగొండ మండలం వల్లపురం గ్రామంలోని పురాతన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.3 కోట్ల 23 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులు మంజూరు తో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ నిధులను మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా గ్రామ ప్రజల విశ్వాసానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా ప్రతి శివరాత్రి సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటూ, భక్తి భావాన్ని చాటుతూ వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఈ దేవస్థానం పట్ల చూపుతున్న అనుబంధం ఎంతో ఆదర్శప్రాయం. ఈ నిధులతో దేవాలయం మరింత అభివృద్ధి చెంది, భక్తులకు సౌకర్యాలు పెరిగి, ప్రాంతీయ ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ప్రశంసనీయమైనది.
ఈ దేవస్థానం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఐనలా నరసింహారావు, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మట్టా రవీందర్ రెడ్డి వల్లపురం గ్రామ ప్రజలు, ముదిగొండ, చింతకాని మండల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.






