17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పేదల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

26-02-2026 01:07 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఫిబ్రవరి 25,(విజయక్రాంతి) వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామంలో ఓపెన్ జిమ్, రూ.26 లక్షల సీసీ రోడ్లు, రూ.20 లక్షల గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షల మహిళా సమైక్య భవనం, నమిలిగుండుపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్, రూ.12 లక్షల అంగన్వాడీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందన్నారు.

వట్టెంల గ్రామానికి ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వట్టెంలచెక్కపల్లి రోడ్డును త్వరగా పూర్తి చేయాలని, సైడ్ డ్రైనేజీలు నిర్మించి జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.మహిళల సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి కింద రూ.5 లక్షల సహాయం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.