17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

లిథియం మైనింగ్‌లో భాగస్వామ్యానికి సింగరేణికి ఆహ్వానం

26-02-2026 01:07 AM

సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసిన బ్రెజిల్ సీబీఎల్ కంపెనీ ప్రతినిధులు

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : తాము చేపట్టిన లిథియం మైనింగ్‌లో సింగరేణి భాగస్వామిగా చేరాలని బ్రెజిల్ దేశానికి చెందిన సీబీఎల్ సంస్థ సింగరేణిని కోరింది. ఈ మేరకు సీబీఎల్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసి వివరాలను తెలియజేసింది.

బ్రెజిల్‌లో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించింది. బ్రెజిల్ దేశంలో కీలక ఖనిజ అవకాశాలను, లాభదాయకత తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా సింగరేణి ఉన్నతాధికారులు పేర్కొన్నారు.