సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది
- రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం
- ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, జూలై -29(విజయక్రాంతి): ప్రజల ఆశ్వీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభు త్వం సంక్షేమం, అభివృద్ధి జోడేడ్లలా, రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలోని ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేశారు.
డాక్యా తండా గ్రామంలో రూ. 1.41 కోట్ల వ్యయంతో మంగళగూడెం డాక్యా తండా బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అనంతరం పల్లెగూడెం గ్రామంలో రూ.5.80 కో ట్లతో గొల్లగూడెం నుండి ఎన్.ఎస్.పీ. మీదు గా పల్లెగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరె డ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభు త్వ పాలనకు కేంద్ర బిందువని, పేదలు, రై తులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే ల క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాల వల్లే సంక్షేమ ప థకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ స్థాయి వరకు చేరుతున్నాయని వివరించా రు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున 9 రోజుల్లో 9200 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశామని, వరి రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వరిధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ అందించామని అన్నారు.
25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లను రూ. 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీ అమలు చేసి రైతులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించామని వివరించారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మద్దతు కార్యక్రమాలను కూడా ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోందన్నారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి అన్నారు. అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు.పేదల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడతలో సుమారు నాలుగున్నర లక్షల ఇళ్లు, రెండో విడతలో రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
రెండో విడతలో ఇంకా మిగిలిన గ్రా మాలకు ఇళ్లు మంజూరు చేయనున్నామని, మూడో, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఎక్కడా ఆగిపోకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అన్నారు.
గ్రామీణ రహదారులు, వి ద్యాసంస్థలు, త్రాగునీరు, మౌళిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట ను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఏదులాపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






