5 May, 2026 | 5:48 PM

అవినీతికి పాల్పడ్డ పోలీసులపై వేటు

27-10-2024 01:12 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జిల్లాలోని నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్ష న్ వేటు పడింది. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన సోనియాతోపాటు ఏఎస్సై మను, కానిస్టేబుళ్లు ఉమేశ్, రమేశ్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్  ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.