04-12-2025 12:00:00 AM
కరీంనగర్, డిసెంబరు 3 (విజయ క్రాంతి): జిల్లాలోని గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల గడువు కూడా ముగియడంతో సామ రాజిరెడ్డి ఎన్ని క ఏకగ్రీవం లాంఛనమే కానుంది. సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు 10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులను కేటాయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించిన విషయం తె లిసిందే.
జిల్లాలో బీజేపీ పక్షాన తొలి ఏకగ్రీవం కావడంతో ఇచ్చిన మాట మేరకు ఆయా నిధులను అందజేస్తానని బండి సం జయ్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లేకుండా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు 10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించింది. దీంతో పీచుపల్లికి మొత్తం 20 లక్షల ప్రోత్సాహక నిధులు అందనున్నాయి. ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివ్రుద్ధి చేసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.