04-12-2025 12:00:00 AM
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విషాదం
ఎల్బీనగర్, డిసెంబర్ 3 : విధి నిర్వహణలో ఉండగా మంగళవారం రాత్రి గుండెపోటుతో ఎల్బీనగర్ ఎస్సై సంజయ్ సావంత్ (58) మృతి చెందారు.1989 బ్యాచ్ కి చెందిన సంజయ్ సావంత్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు నిర్వహిస్తు రెస్ట్ రూమ్ లోకి వెళ్లి కూర్చిలో కూర్చొని ఉండగా గుండెపోటు రావడంతో సంజయ్ సావంత్ అక్కడికక్కడే మృతిచెందారు.
ఎస్సై హఠాన్మరణంతో పోలీస్ స్టేషన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాచారంలో నివాసం ఉంటున్న సంజయ్ సావంత్ బుధవారం ఉదయం అబ్దుల్లాపూ ర్ మెట్టు మండలంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉండడంతో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ లోనే నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఎస్సై మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.