30 April, 2026 | 2:46 AM

రైతాంగ సమస్యలను పరిష్కరించాలి

30-04-2026 01:14 AM

మంత్రి శ్రీనివాస్ రెడ్డికి సిపిఎం వినతి

కూసుమంచి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో వరి కాటాలో తరుగు పేరుపై సుమారు 10 కిలోల వరకు వరిలో కోత పెడుతున్నారని ఇది వెంటనే అరికట్టాలని, రైతులు పండించిన పంట రోడ్లపైనే ఆరబోసు ఉందని, ఐకెపి, సొసైటీల ద్వారా పంటలను త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

బుధవారం మండలంలోని పాలేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన కు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలో ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి పంటలో కాటాల సమయంలో సుమారు 10 కిలోల వరకు పంటలో తరుగు తీస్తున్నారని దీని అరికట్టాలని వారి డిమాండ్ చేశారు.

మొక్కజొన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, కాటాలు వేసిన వరి, మొక్కజొన్న పంటలను లారీలల్లో ఎక్కించి వెంటనే మిల్లర్లకు లేదా గోడంలకు తరలించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు యడవల్లి రమణారెడ్డి, పాలేరు గ్రామ ఉపసర్పంచ్  వెలిశేట్టి ఉప్పయ్య,సిపిఎం సీనియర్ నాయకులు కంచర్ల జగన్మోహన్ రెడ్డి, పందిరి వీరారెడ్డి, కందుల బాబు, నాగిరెడ్డి, జగదీష్ ,ఉమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు