12 May, 2026 | 1:23 AM

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది

12-05-2026 12:17 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మూసాపేట మే 11 : గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మూసాపేట్ మండలం సంకల్ మద్ది గ్రామ సమీపంలోని కేజీబీవీ పాఠశాల లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బిఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 15 ఏళ్ల తర్వాత సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, స్కూలు ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు పంపిణీ చేశామని, పదేళ్లలో ఎన్నడు లేని విధంగా విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.