20 March, 2026 | 3:46 AM

రెండు నిండు ప్రాణాల ఖరీదు రూ.19 లక్షలు

20-03-2026 12:16 AM

ప్రాణాలకు వేల కట్టిన సెయింట్ పీటర్స్ పాఠశాల యాజమాన్యం

జగదేవపూర్, మార్చి 19: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిదిలోని పీర్లపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ స్కూల్ బస్సు డీ కొని రెండు నిండు ప్రాణాలు పోయాయి. అలకుంట రమేష్ (48) అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతిడికి భార్య రేణుక ముగ్గురు పిల్లలు ఉన్నారు. లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (60) చికిత్స పొందుతూ ఆసుపత్రి లో మరణించాడు.

శ్రీ చైతన్య సేంట్ పీటర్స్ బస్సు లు అధిక వేగం తో రోడ్ పైన తిరుగుతు ప్రజల ప్రాణాలు తీస్తున్నయి అని ప్రజలు వాపోతున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారంగా పాఠశాల యాజమాన్యం  రూ.19 లక్షలు ప్రకటించినట్లు సమాచారం. మృతుడు అలకుంట రమేష్ కుటుంబానికి రూ.14 లక్షలు. మృతుడు మల్లయ్య కుటుంబానికి 4 లక్షలు ఒప్పుకున్నట్లు ప్రజలు మాట్లాడుకుంటూన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే విద్య శాఖ అధికారులు, ఆర్ టి ఓ అధికారులు ఈసారి అయినా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.