6 July, 2026 | 2:05 AM

సీసీ కెమెరాలు నిఘానేత్రాలు

06-07-2026 01:01 AM

పీఏసీ చైర్మన్ గాంధీ

కూకట్‌పల్లి, జూలై 5 (విజయక్రాంతి): సిసి కెమెరాలు 24 గంటలు నిఘా నేత్రలుగా పని చేస్తాయని పి ఏ సి చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిసది ఎల్లమ్మబండ కేటీఆర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యర్యం లో ఏర్పాటుచేసిన రూ. 80 వేల రూపాయల10 సీసీ కెమెరాలను ఆదివారం అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా హాజరై  మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు,ఎస్ ఐ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు అన్నారు. ఎంత పెద్ద నేరం, దొంగతనం చేసిన సీసీ కెమెరాలు దొరికిపోతారన్నారు.

నేటి సమాజంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు సీసీ కెమెరాలు  అవసరమైన భద్రత సాధనంగా మారాయని పేర్కొన్నారు. కాలనీలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రధాన రహదారులు, పార్కులు లాంటి ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే స్థలాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే నేరాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం ద్వారా ద్వారా ప్రజల భద్రత, ప్రశాంతమైన సమాజ నిర్మాణం సాధ్యమైతుందని తెలిపారు.

కాలనీ అభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతులే కాదని భద్రత కూడా అయన అన్నారు. నియోజకవర్గం లో ప్రతి కాలనీని ఆదర్శవంతంగా  సురక్షితమైన కాలనీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రజల సహకారం ఉంటే అది సాధ్యమైతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.