27-10-2025 05:54:47 PM
నకిరేకల్ (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కందాల పాపిరెడ్డి కోరారు. సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి వీరమల్ల రవీందర్, కోశాధికారి చిక్కు రవీందర్, సహా అధ్యక్షుడు పోతుల రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు పోతుల వెంకటనారాయణ, సహకార దర్శి బిక్షం రెడ్డి, మహిళా ప్రతినిధులు ఉత్తరమ్మ, రమణా రామ్, తదితరులు ఉన్నారు.