calender_icon.png 27 October, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

27-10-2025 05:52:54 PM

ఎస్ఐ యుగేందర్ గౌడ్..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి ఉన్నత పాఠశాల విద్యార్థులతో సోషల్ మీడియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ ఎస్ఐ యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ... మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకుని చాటింగ్ లు చేసి జీవితాలని నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు తమ విద్య ఉజ్వల భవిష్యత్తుకై తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మాట గౌరవిస్తూ, ఉపాధ్యాయుల మాట వింటూ, సమాజంలో తోటి వారిని గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.