calender_icon.png 1 November, 2024 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలి

19-04-2024 12:50:00 AM

22న జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలో జేఏ సీ సమావేశం నిర్వహించారు. కన్వీనర్ మూశం రమేశ్ మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమలో సంక్షోభంతో ౩ నెలల నుంచి కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడంతో.. వారం రోజుల్లో సమస్యలు తీరుస్తామని మంత్రి పొన్నం  హామీ ఇచ్చార న్నారు. నేటికీ అమలు చేయలేదని చెప్పారు. ప్రభు త్వం హామీలను వెంటనే అమలు చేయా లని డిమాండ్‌చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. నాయకులు రవీందర్, రవి, సత్యం, దామోదర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.