20 March, 2026 | 5:20 AM

అంగరంగ వైభవంగా బండ్ల ఊరేగింపు

20-03-2026 12:07 AM

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

కొల్చారం, మార్చి 19 :ఉగాది పండగను పురస్కరించుకొని గురువారం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉగాది పండుగను  ప్రజలు  వైభవంగా జరుపుకున్నారు.  వరిగుంతం, రాంపూర్, కొల్చారం, రంగంపేటతో పాటు ఆయా గ్రామాలలో గ్రామ దేవతలకు దుర్గమ్మ,  నల్ల పోచమ్మ తో పాటు దేవతలకు బండ్ల ఊరేగింపు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రశాంత్,  ఉపాధ్యక్షుడు మోహన్,  నర్సింలు, సాయిరాం,  నాగరాజు, సంతోష్, మధు, రవితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.