4 June, 2026 | 1:33 AM

సకాలంలో మక్కల కొనుగోలు పూర్తి చేయాలి

04-06-2026 12:46 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ 

సదాశివనగర్, జూన్ 3 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరిం చాలని,మక్కల కొనుగోలు పక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ అన్నారు. బుధవారం సదాశివ నగర్ మండలంలోని పద్మజివాడి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

రైతుల సౌకర్యాలు, తూకం పక్రియ, నిల్వ ఏర్పాట్లు,చెల్లింపుల విధానం పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి, చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ ఐ సంతోష్, ఏవో ప్రజాప్రతి, విండో చెర్మన్ గంగాధర్, పద్మావతి వాడి సర్పంచ్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాల్గొన్నారు.