4 June, 2026 | 1:19 AM

చిత్రా లేఔట్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెంటర్

04-06-2026 12:48 AM
  1. నిరుపయోగంగా ఉన్న వస్తువులను లేనివారికి అందజేయాలి 
  2. సరూర్ నగర్, ఎల్బీనగర్ డీసీలు శ్రీనివాస్, బి.శ్రీనివాస్

ఎల్బీనగర్, జూన్ 3 : ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను లేనివారికి అందజేయాలని సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ బొనగిరి శ్రీనివాస్ సూచించారు. ఇందుకోసం ఎల్బీనగర్ లోని చిత్రా లేఔట్ లో ఓజోన్ హాస్పిటల్స్ సహకారంతో బుధవారం చిత్రా లేఔట్ అసోసియేషన్ అధ్యక్షు డు పెండ్యాల నగేశ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ ను ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ అనగా రీ య్యూస్, రీడ్యూస్, రీసైక్లింగ్ వస్తువులను నిల్వ చేసే కేంద్రం అన్నారు.

ఉదాహరణకు బట్టలు, పుస్తకాలు, సోఫాసెట్, కుర్చీలు కూలర్లు,ఇతరత్ర ఎలాంటి ఉపయోగకర వస్తువులను ఈ కేంద్రంలో ప్రజలు అందజేయాలని కోరారు. అవసరం ఉన్నవారు ఇక్కడి వస్తువులను తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్, బోనగిరి శ్రీనివాస్, శానిటేషన్ డీఈ చందన, ఏఈ షరీఫ్, ఎస్.ఎస్ బుచ్చయ్య, ఓజోన్ హాస్పిటల్ వీఆర్వో రవీందర్ రెడ్డి, కాలనీ వాసులు గణేష్, సత్యనారాయణ రెడ్డి, రంగారావు, కిషోర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రావు, రవికుమార్, అంజల్ రావు, రాధిక,  తదితరులు పాల్గొన్నారు.