5 June, 2026 | 1:13 AM

తప్పుడు ఓటరు నమోదుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

05-06-2026 12:03 AM

మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాఘవేందర్ గౌడ్

మేడ్చల్ అర్బన్ జూన్ 4(విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని పలు కాలనీలలో ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలోని వాళ్లు కాలనీలలోని కొన్ని ఇలా చిరునామాలపై సంబంధిత కుటుంబాలకు తెలియకుండా అనవసరంగా తప్పుగా ఓటర్ నమోదు ఉండవచ్చనే అంశంపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

అదేవిధంగా మీ ఇంటి చిరునామా పై నమోదైన ఓటర్ల వివరాలను పరిశీలించి అక్కడ నివసించని వారి పేర్లు ఉన్నట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని రాఘవేందర్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో ‘స్పెషల్ ఇంటెన్సీ రివిజన్‘(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం తో అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వివరాలను ధ్రువీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

అలాంటి సమయంలో మీ ఇంటి వివరాలను సక్రమంగా తెలియజేసి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దేందుకు అధికారులకు పూర్తిగా సహకారం అందించాలని ఆయన తెలియజేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన పారదర్శకమైన ఓటరు జాబితాలు అత్యంత అవసరమని రాఘవేందర్ గౌడ్ చెప్పారు.

అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులకు సహకరించి ఓటరు జాబితాలోని పొరపాట్లను సరిదిద్దే ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.మేడ్చల్ పట్టణంలోని ప్రతి కాలనీ అభివృద్ధి సమాజ శ్రేయస్సు స్వేచ్ఛ నిష్పక్షపాత ఎన్నికల కోసం మీ అందరి సహకారం ఎంతో అవసరం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని రాఘవేందర్ గౌడ్ పట్టణ వాసులకు విజ్ఞప్తి చేశారు...