గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
శంకర్ పల్లి, జూన్ 4( విజయక్రాంతి ): గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శంకర్ పల్లి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మోకిల గ్రామపంచాయతీలో గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, మంచినీటి సౌకర్యం, వీధి దీపాల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందని చెప్పారు.
కాగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మోకిల గ్రామ సర్పంచ్ చిట్టెపు శేఖర్, ఉప సర్పంచ్ మాధవి, మండల వ్యవసాయ అధికారి చైతన్య, సీఐ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి నరసింహ వార్డు సభ్యులు పాల్గొన్నారు.






