calender_icon.png 15 January, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రవరం లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో రాజమండ్రి న్యాయమూర్తి పూజలు

15-01-2026 01:00:18 AM

కోదాడ, జనవరి 14: మండల పరిధి ఎర్రవరం దూళ్లగుట్ట పై వేంచేసియున్న బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి కి చెందిన సీనియర్ సివిల్ జడ్జ్ కర్రి ప్రకాష్ సత్యప్రియ దంపతులు బుధవారం దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయ నిత్య అన్నదానానికి 25 వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు అనంతరం ఆలయ కమిటీ వారు వారిని జ్ఞాపికతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కర్రి నిఖిల, శ్రీ ఉదయ పద్మిని, ఆలయ కోర్ కమిటీ సభ్యులు  భాషబోయిన భాస్కర్‌రావు కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు