8 July, 2026 | 10:55 AM

ఈటలకు త్వరలో రాష్ట్ర బీజేపీ పగ్గాలు

11-06-2024 01:29 AM

ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన రాజేందర్ 

రేపో మాపో వెలువడనున్న పార్టీ నిర్ణయం  

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): త్వరలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష మార్పు ఉండనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి త్వరలోనే కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తప్పుకోనున్నారని.. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు చేపడుతారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈటలకు పదవి దాదాపుగా ఖాయం అయ్యిందని, అందు కే ఈటల సోమవారం అమిత్ షాతో భేటీ అయ్యారని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని మరింత సమర్థంగా నడిపేందుకు  ఈటలనే సరైన ఎంపిక అనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా పార్టీ నుంచి నిర్ణయం వెలువడనున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు కూడా ఈ విషయం తెలుసనే చర్చ జోరుగా జరుగుతోంది.

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి గా, ఎల్పీ నేతగా విశేషమైన అనుభవం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈటల రాజేందర్ వంటి సమర్థుడైన నాయకుడైతేనే మేలనే యోచనలో అధిపార్టీ ష్ఠానం ఉందని తెలుస్తోంది. ఏదైన అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే తప్పితే ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ చీఫ్ అవకాశం ఖాయమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.