విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
అలంపూర్, జూన్ 28: బీసీ సమాజ్ ,బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో విద్యాహక్కు చట్టం-2009 అమలు, ఫీ రీయింబర్స్మెంట్ అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.ఈ సమావేశానికి బీబీసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగవరం 1 సర్పంచ్ గొంగోల్ల ఈశ్వర్ హాజరై... మాట్లాడారు.తెలంగాణలో విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ఫీ రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, జీవో 7, 8, 9ల ద్వారా విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు అందక డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఇంజినీరింగ్, లా, ఎంసీఏ తదితర కోర్సుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.7,000 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






