29 June, 2026 | 2:03 AM

అభివృద్ధికి పునాదులు వేసిన మహానేత: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

29-06-2026 12:00 AM

కల్వకుర్తి, జూన్ 28: మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి ఎలాంటి కల్మషం లేని నిస్వార్థ ప్రజాసేవ చేసి, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్న మహానేత అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. ఆదివారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా కల్వకుర్తి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ పోతుగంటి రాములుతో కలిసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో  మాట్లాడుతూ, రాజకీయంగా ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకున్నా ప్రజల ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదిగి, కల్వకుర్తి ప్రాంత శాశ్వత అభివృద్ధికి గట్టి పునాదులు వేసిన నాయకుడిగా  చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.  మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, పొల్యూషన్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్,  ఆనంద్ కుమార్, డాక్టర్ దామోదర్ రెడ్డి, అశోక్ రెడ్డి, షాన్వాజ్ ఖాన్, భూపతి రెడ్డి, సంజీవ్ యాదవ్, రమాకాంత్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.