calender_icon.png 9 December, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

09-12-2025 12:29:52 AM

  1. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
  2. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ఆదిలాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ ర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో 2వ, 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణలో స్టేజి -2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు.

రెండవ విడత లోని ఆదిలాబాద్ రూరల్, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్, మూడవ విడత లోని బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల స్టేజ్2 అధికారులు ప్రతి అంశాన్ని క్షున్నంగా పర్యవేక్షించాలని అన్నారు. 

ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్‌పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. నిర్ణిత ప్రొఫార్మాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేసి రెసెప్షన్ కేంద్రంలో అందజేసే బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని వివరించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం, అభ్యర్థుల మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ నిబంధనల పరిశీలన, ఖర్చుల వివరాలు నమోదు, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్, ఇతర సంబంధిత అంశాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిదేదని తెలిపారు.

ఈ నెల 14 వ తేదీన రెండవ విడత పోలింగ్, 17న మూడవ విడత పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.  పోలింగ్ కేంద్రాలను ఒక రోజు ముందే సందర్శించి విద్యుత్, మరుగుదొడ్డి, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు చూసుకోవాల న్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మనోహర్, డీపీఓ రమేష్, డిఎల్పీఓ ఫణీందర్,  మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.