మల్లికార్జునుడికి నాభిషేకం
17-03-2026 03:08 PM
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం మార్పడగా శ్రీ విజయదుర్గ సామెత సంతాన మల్లికార్జున స్వామికి పాల్గున మాస శివరాత్రి పురస్కరించుకొని మంగళవారం క్షేత్ర నిర్వాహకులు చెప్పాలా హరినాధ శర్మ ఆధ్వర్యంలో అన్నపూజ నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి విజయదుర్గా మాతకు విశేష పంచామృత పలరస అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలను అలంకరించారు. కృష్ణం గారక చతుర్దశి కావడంతో సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం నిర్వహించి లఘువ్యాస పూర్వకంగా సంతాన మల్లికార్జున స్వామికి అన్న పూజ నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు, చీకోటి రాజేంద్రప్రసాద్, లగిశెట్టి రాజేష్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.




