10 May, 2026 | 2:12 AM

గాలికుంటు వ్యాధి ముప్పు: పశు రైతులు తప్పక టీకాలు వేయించాలి!

17-03-2026 03:01 PM

పుశు రైతులు తప్పక సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ సంపత్

ముత్తారం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గాలి కుంటూ నివారణ టీకాలు ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ ఆధ్వర్యంలో పశు వైద్యాధికారుల పర్యవేక్షణలో పశువులకు మంగళవారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు, సర్పంచ్ మాట్లాడుతూ... పశువులకు గాలి కుంటూ కావడం వల్ల  పశువుల డేక్కల మధ్యలో పుడ్లు, నోటి నుండి సొల్లు రావడం  జ్వరం అధికంగా ఉండడం జరుగుతుందని, అలాగే పాలు తగ్గడం మేత తినకపోవడం వల్ల పశువులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ వ్యాధి సోకాకుండ  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గాలి కుంటూ నివారణ టీకాలను పశు రైతులు తప్పకుండా పశువులకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  విఏఎస్ డా. కళ్యాణి  గోపాల మిత్ర  సారయ్య,  వైద్య సిబ్బంది సుధాకర్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

గాలికుంటు వ్యాధి ముప్పు: పశు రైతులు తప్పక టీకాలు వేయించాలి!

పశువులకు ఉచిత టీకాలు: రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం!

వర్షాకాలానికి ముందు జాగ్రత్త: పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి!