శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పాత్ర కీలకం
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
రాజన్న సిరిసిల్ల, మార్చి 11(విజయ క్రాంతి):సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ మోబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్పీ పరేడ్ మైదానంలో నిర్వహించిన సాయుధ దళాల సమీకరణ కవాతు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరై గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ అధికారులు,సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించా రు.
శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం కూ డా ఎంతో సమర్థవంతంగా పని చేస్తోందని, అదే ఉత్సాహంతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.వార్షిక మో బిలైజేషన్ శిక్షణలో భాగంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆరమ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనియల్ డ్రిల్, గార్డ్ మౌం టింగ్, మాబ్ ఆపరేషన్, ఫైరింగ్, నాకబంది,
పికెట్స్, వీఐపీ బందోబస్త్ విధులు, ప్రిసనర్ మరియు క్యాష్ ఎస్కార్ట్ వంటి అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు.పోలీస్ ఉద్యో గం ఎంతో బాధ్యతాయుతమైనదని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ శారీరక దారుఢ్యం కాపాడుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఇందుకు మోబిలైజేషన్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన మరియు శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఎస్పీ తెలిపారు.అంతకుముందు వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న,అధికారులకు సిబ్బందికి సార్ధపూర్ బెటాలియన్ లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఇచ్చే ఫైరింగ్ శిక్షణను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.
అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది.ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు.1st బి. శ్రీనివాస్.2nd జి. వెంకటేష్.3rd ఏ. ప్రియాంక.రాత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు.1st మనోజ్ కుమార్.2nd బి. శ్రీనివాస్.3rd డి. ప్రియాంక. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది ఉన్నారు.




