25 June, 2026 | 2:19 AM

కోడెలను వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి

25-06-2026 01:26 AM

వేములవాడ, జూన్ 24 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరు కాగా జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఆలయ ఈవో రమాదేవి , మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజలు పాల్గొన్నారు.

అది శ్రీనివాస్ మాట్లాడుతూగోశాలలో ఉన్న కోడెలను రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కోడె మొక్కలు చెల్లించే సంస్కృతి రాజన్న సన్నిధిలో తప్ప ఎక్కడా లేదని పేర్కొంటూ భక్తులు స్వామి కిసమర్పించిన నిజ కోడెలనురైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే చాలా సార్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న రైతులను గుర్తించి వారికి అందించామని, బుధవారం 100 మంది రైతులకు కోడెలను పంపిణీ చేశామనిరైతులకు అందించిన కోడెలను వ్యవసాయంకు మాత్రమే ఉపయోగించాలనికోడేలను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కోడెల కోసం మర్రిపల్లిలో 40 ఎకరాల కేటాయించడం జరిగిందని. అధునాతన పద్ధతిలో గోశాల నిర్మా ణం చేపడతామని అన్నారు.రానున్న రోజుల్లో ఇతర జిల్లాల రైతులకు కోడెలను పంపిణీ చేస్తామనిరైతులు కోడెలను సంరక్షిస్తూ వాటితో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలుదొక్కు కోవాలన్నారు.