9 May, 2026 | 5:15 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

స్వరాష్ట్ర ఏర్పాటులో వర్సిటీల పాత్ర కీలకం

30-07-2025 12:00 AM

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్  ఆకునూరి మురళి

నల్లగొండ రూరల్, జూలై 29 :  రాష్ట్ర ఏర్పాట్లు లో చురకైన పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలు అభివృద్ధిలో తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు మంగళవారం నల్గొండ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రజా విచారణ చేపట్టింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు  ఆచార్య పి ఎల్ విశ్వేశ్వర రావు, డా చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి  లు ప్రజా విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి   వసతులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

విశ్వవిద్యాలయ ప్రస్తుత స్థితిగతులపై  వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం  అధ్యాపక,  బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో  విశ్వవిద్యా లయంలో నెలకొన్న వివిధ సమస్యలు,  అవసరాలపై ఆరా తీశారు  ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్  ఆకునూరి మురళి మాట్లాడుతూ . విద్య విముక్తి, అభ్యున్నతికి,దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాధనంగా , నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశభక్తిని పెంపొందించే గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు.

విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది , విద్యార్థి సంఘాలతో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో వారి సమస్యలపై చర్చించారు. విద్యార్థులు తమ కళాశాలలు, క్రీడా సదుపాయాలు, హాస్టల్లో నెలకొన్న సమస్యలపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.  పోటీ పరీక్షల కు వెసులుబాటు కల్పించాలని కోరారు.  ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు రియంబర్స్మెంట్ 4 సంవత్సరాల బకాయిల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు . 

కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను సర్వీసుల క్రమబద్ధీకరణతో పాటు, సర్వీస్ గుర్తింపు ద్వారా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  250కి పైగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మూడు అంచల  వేతన విధానం ద్వారా  నష్టపోతున్నట్లు,  ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.  కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ప్రిన్సిపాల్ డా శ్రీదేవి, డా అరుణప్రియ,, డా సుధారాణి,  ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి,  ఆచార్య రేఖ, డా మదిలేటి, డా మిరియాల రమేష్,  డా దోమల రమేష్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.