29-07-2025 11:37:05 PM
నాగార్జునసాగర్ డ్యాం 14 గేట్లు ఎత్తడంతో భారీగా కృష్ణమ్మ చెంతన పరవళ్ళు తొక్కుతున్న వరద నీరు..
హుజూర్ నగర్/చింతలపాలెం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar Project)కు భారీగా వరద నీరు చేరి డ్యామ్ పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంది. దీంతో మంగళవారం సాగర్ 14 గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు చేరి పులిచింతల ప్రాజెక్టు(Pulichintala Project) జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పెద్దగా లేకపోయినప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లు ఎత్తారు. నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.