calender_icon.png 6 December, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో కొనసాగిన భక్తుల రద్దీ

15-10-2024 02:42:44 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగి రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగింది. దసరా సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ వీధుల్లో సందడి నెలకొంది. దర్శన, ప్రసాద క్యూలైన్లలో బారులు తీరారు.

కాగా, అర్చకులు వేకువజాము నుంచి స్వామివారికి నిత్యకైంకర్యాలు జరిపి, అర్చనలు అష్టోత్తర పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమ పూజల అనంతరం లక్ష్మీన రసింహ నిత్యకల్యాణం ఆగమశాస్త్రానుసారం జరిపారు. సాయంత్రం లక్ష్మీనర సింహుల అలంకారమూర్తులను ఊరేగిస్తూ భక్తులకు తిరువీధి దర్శనాలు కల్పించారు. స్వామివారికి సోమవారం భక్తుల నుంచి వివిధ కైంకర్యాల ద్వారా రూ.27,13,654 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.