చీమలపాడు, ఆర్ కొత్తగూడెం ఇసుకరాపు సమస్యల్ని పరిష్కరించాలి
కలెక్టర్ ఆఫీస్ ఎదుట కొత్త సొసైటీ సభ్యుల ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30, (విజయక్రాంతి): చీమలపాడు, ఆర్ కొత్తగూడెం ఇసుక ర్యాంపుల సమస్యలను క్షణమే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కిచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశాడు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చీమలపాడు ఆర్ కొత్తగూడెం ఇసుక సొసైటీ కమిటీలు సమయం పూర్తి కావడంతో మహాజనసభల ద్వారా నూతన కమిటీ ఎన్నిక చేశారన్నారు.
ఈ ఎన్నిక అధికారుల సమక్షంలో జరిగినప్పటికీ ఉన్నత అధికారులు ఈ రాంపుల విషయంలో అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సొసైటీ సభ్యుల మధ్య గొడవలకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు. అధికారుల కాలయాపన, ఆధారం చేసుకుని పాత కంపెనీ వారు కోర్టుని తప్పు దోవ పట్టించి ఇసుక ఆన్లైన్ పెట్టే ఆర్డర్ ను కోర్టు ద్వారా పొందడం జరిగిందన్నారు .ఇది ఇసుక నిబంధనలకు, పీసా చట్టానికి విరుద్ధమని ఆరోపించారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమార్కులతో జోడి కాకుండా వారి బాధ్యతలను వారు నెరవేస్తూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జాటోత్ కృష్ణ, కల్లూరు కిషోర్, వెంకటేశ్వర్లు, సాయన్న, మునిగేలా శివ ప్రశాంత్, చర్ల మండలం పార్టీ మండల కార్యదర్శి పాలెం చుక్కయ్య, శ్రీ సిర్రాజు సొసైటీ అధ్యక్షురాలు ఇర్ఫా సామ్రాజ్యం, ఆర్ కొత్తగూడెం సొసైటీ అధ్యక్షురాలు అశ్విని, సభ్యులు పాల్గొన్నారు.






