1 June, 2026 | 3:03 AM

చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

01-06-2026 02:19 AM
  1. సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
  2. తొలి భారత ద్వయంగా రికార్డ్

సింగపూర్, మే 31 : భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ నెం.1 జోడీ  సాత్విక్ సా యిరాజ్,- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. కె రీర్‌లో తొలిసారి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ 750 టోర్నమెంట్ టైటిల్ కైవసం చేసు కుంది. ఫైనల్‌లో సాత్విక్--చిరాగ్ జోడీ 18--21, 21--17, 21--16 తేడాతో ఇండోనేసి యాకు చెందిన ఫజార్ అల్ఫియాన్ - ముహమ్మద్ రియాన్‌పై విజయం సాధించింది. టై టిల్ పోరు చివరి వరకూ హోరాహోరీగా సా గింది. 

గంటా 13 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలి గేమ్ కోల్పోయినా తర్వాత పుంజుకుని విజేతగా నిలిచింది. తొలి గేమ్ లో ఇండోనేషియా జంట ఆధిపత్యం కనబరిచి 21-18తో గెలిచి ఆధిక్యంలో నిలిచింది. అయితే నిరాశ పడని భారత జోడీ రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని స్కోర్ స మం చేసింది. విజేతను డిసైడ్ చేసే మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించిన సా త్విక్, చిరాగ్ 21-16తో గెలిచి టైటిల్ సొం తం చేసుకున్నారు. దీంతో సింగపూర్ ఓపెన్ గెలిచిన భారత తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ షెట్టి రికార్డు నెలకొల్పారు.

ఇదిలా ఉంటే సాత్విక్- చిరాగ్ జోడీ చివరిసారిగా 2024లో థాయ్‌లాండ్ ఓపెన్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఈ జోడీ నాలుగుసార్లు వేర్వేరు టో ర్నీల్లో ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ టైటిల్ నెగ్గలేకపోయారు. నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు సింగపూర్ ఓపెన్‌తో టైటిల్ నిరీక్షణకు తెరదించారు.

సాత్విక్-చిరాగ్ షెట్టి కెరీర్‌లో ఇది తొమ్మిదో వరల్డ్ టూ ర్ టైటిల్. అలాగే మూడో సూపర్ 750 టై టిల్. దాదాపు రెండేళ్ల తర్వాత వరల్డ్‌టూర్‌లో విజేతగా నిలవడంతో సాత్విక్- ,చిరాగ్ సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్‌లో గెలిచిన తర్వాత సాత్విక్ బేబీ థీమ్‌తో సంబరాలు చేసుకోగా, ఇద్దరూ కోర్టులోనే డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.