26 July, 2026 | 4:49 PM

సిర్గాపూర్ బీటీ రోడ్డుకు మరమ్మతులు చేసిన సర్పంచ్

26-07-2026 03:46 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ నుండి నారాయణ్ ఖేడ్ వెళ్ళే దారిలో పెట్రోల్ పంపు ఎదురుగు బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ చొరవ తీసుకుని శనివారం రోడ్డుకు మరమ్మతులు చేయించారు. దీంతో రహదారిపై ప్రయాణం సులభంగా మారడంతో గ్రామస్థులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల సమస్యలను వెంటనే గుర్తించి స్పందించడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడతామని సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ తెలిపారు.