అన్ని కాలనీలలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
26-07-2026 03:53 PM
సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం,జులై 26 (విజయ క్రాంతి): అన్ని కాలనీలలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ వడ్డెర కమ్యూనిటీ హాల్ సమీపంలోని నూతన బోరు మోటర్ ను ఆదివారం కటుకూరి రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఉన్న తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు.






