24 May, 2026 | 12:29 AM

తాటి ముంజల కాలం

24-05-2026 12:00 AM

ఎండలు మండిపోతున్న వేళ ప్రజలు చల్లదనం కోసం సహజ ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవి కాలంలోనే సహజసిద్ధంగా లభించే తాటి ముంజలు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి శక్తిని అందించే ఔషధ గుణాలు కలిగిన ఆహారంగా గుర్తింపు పొందాయి. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శరీరంలో కోల్పోయే ద్రవాలను భర్తీ చేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తాటి ముంజల్లో ఉండే సహజ ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి. తాటి ముంజల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎండల ప్రభావంతో చర్మం పొడిబారడం, దురదలు, వేడి పొక్కులు వంటి సమస్యలు రావు. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంచాలనుకునేవారికి ఇవి మంచి ఆహారంగా పరిగణిస్తారు. తాటి ముంజలు మృదువుగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినవచ్చు. వేసవి కాలంలో తాటి ముంజల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తాయి. 

వొడ్యాల వేణు, 

విజయక్రాంతి, వేములవాడ