calender_icon.png 22 February, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ పట్టేశారు

22-02-2026 01:14:01 AM

ఆసీస్ గడ్డపై భారత మహిళల జోరు

అడిలైడ్, ఫిబ్రవరి, ౨1: భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. కంగారూల గడ్డ పై చాలా కాలం తర్వాత సిరీస్ విజయాన్ని రుచి చూసింది. అడిలైడ్ వేదికగా జరిగిన చి వరి టీ ట్వంటీలో ఆసీస్ ను ఓడించింది. దీం తో 2015-16 తర్వాత తొలిసారి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మం ధాన బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ(7) పరుగులకే ఔటై నిరాశపరిచినా స్మృతి మంధాన దుమ్మురేపింది.

జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంది వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసు కోవడంతో పాటు రెండో వికెట్ కు కేవలం 82 బంతుల్లోనే 121 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. స్మృతి 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82, జెమీమా 46 బంతు ల్లో 4 ఫోర్లతో 59 పరుగులు చేసింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఛే దించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ మహిళల జట్టు కూడా దూకుడుగానే ఆడేందుకు ప్ర యత్నించింది. అయితే భారత బౌలర్లు వారి జోరుకు కళ్లెం వేశారు.

పవర్ ప్లేలోనూ 3 కీల క వికెట్లు తీసి దెబ్బకొట్టారు. ఓపెనర్లు జార్జి యా వాల్ (10), బెత్ మూనీ (6), ఎల్లిస్ పెర్రీ(1) పరుగుకే ఔటయ్యారు. ఈ దశలో లిచ్ ఫీల్, గార్డనర్ ఆసీస్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 31 పరుగులు జోడించగా.. లిచ్ ఫీల్ ను తెలుగమ్మాయి శ్రీచరణి పెవిలియన్‌కు పంపింది. 57 రన్స్ చేసిన గార్డనర్ ను అరుంధతిరెడ్డి ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సదర్లాండ్ కాసేపు ధాటిగా ఆడడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో ఆమె ను శ్రేయాంక పాటిల్ ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. తొలి మ్యాచ్ లో భారత్ గెలవగా.. తర్వాతి మ్యాచ్ లో ఆసీస్ గెలిచి సిరీస్ ను సమం చేసింది. సిరీస్ డిసైడర్ లో అదరగొట్టిన భారత్ ఆసీస్ నిలువరించి ట్రోఫీని సొంతం చేసుకుంది.