సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసి ఎస్పీ
సూర్యాపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికారడ్స్ ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న కమాండెంట్ కంట్రోల్స్ సెంటర్ ను పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ రోప్ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌ఐ లు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్ నాథ్, శివతేజ సిబ్బంది ఉన్నారు.




