28 June, 2026 | 3:50 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

పోరాటాల పార్టీ సీపీఐ

04-04-2026 12:28 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి

దేవరకొండ, ఏప్రిల్ 3 : పోరాటాల పార్టీ సిపిఐ అని ఆ పార్టీకి ప్రజలంతా చేయూతనివ్వాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు.  శుక్రవారం  ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా దేవరకొండలో  నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో మతోన్మాద, కార్పొరేట్ కబంధహస్తాల నుండి దేశాన్ని విముక్తి చేసి సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు.. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు తదితర ప్రజాసంఘాలను నిర్మించి, వెట్టి చాకిరి నిర్మూలనకు, కార్మికులు, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి సిపిఐ అనేక పోరాటాలు సాగించిందన్నారు.

అమరవీరుల రక్త త్యాగాలతో ఎన్నో విజయాలు సాధించి, భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదన్నారు. తదుపరి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నిరంకుశ నిజాం పాలనను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగంతో 3000 గ్రామాలను విముక్తి చేసి, దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐదన్నారు.

యుద్దం పేరుతో నిత్యవసర సరుకుల ధరలు పెంచటం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే కాంతయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు డి సుదర్శన్ రెడ్డి, ఎస్ కనకాచారి,పి వెంకటయ్య, కే జయరాములు పాల్గొన్నారు.