13 June, 2026 | 2:16 AM

యువత సేవాభావం

13-06-2026 12:00 AM

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన యువత 

కోహెడ, జూన్ 12: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో   సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చెట్టు నెల కూలింది. రోడ్డు పై చెట్టు కులడంతో ప్రయాణికుల రాకపోకలకు అంత:రాయం ఏర్పడింది. దింతో గ్రామ యువకులు వెంటనే స్పందించి ట్రాక్టర్ సహాయంతో చెట్టును తొలగించి రహదారిని యథావిధిగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సేవా కార్యక్రమంలో దండవేని శ్రీకాంత్, కుంభం నరేష్, 4వ వార్డు మెంబర్ దండవేని అఖిల్, దండవేని సాయి, మేడవేణి రామ్ చరణ్, మద్దెల రాజేష్, మద్దెల చరణ్, దండవేని శ్రీ చరణ్, దండవేని అనిల్ పాల్గొన్నారు.వారి సమయస్ఫూర్తి, సేవా దృక్పథానికి గ్రామ ప్రజలు అభినందించారు.