13 June, 2026 | 2:14 AM

యూపీఎస్సీ మెయిన్స్ బుక్స్ ఆవిష్కరణ

13-06-2026 12:00 AM
  1. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రూపకల్పన
  2. సివిల్స్ ప్రిపేరయ్యే ప్రతి అభ్యర్థికి వజ్రకవచం లాంటివి ఈ పుస్తకాలు

హైదరాబాద్, జూన్ 12(విజయక్రాంతి): భారత దేశంలోని ప్రముఖ సివిల్ సర్వీసెస్ శిక్షణా సంస్థల్లో ఒకటైన ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప రీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన పీవైక్యూ (ప్రీవియస్ ఇ యర్స్ క్వశ్చన్స్) అండ్ ఆన్సర్స్ పుస్తకాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని అశోక్ నగర్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ క్యాంపస్‌లో ఘనంగా జరిగింది.

ఆర్సీ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సంగమిత్ర మే డమ్, అధ్యాపక బృందం, యూపీఎస్సీ ర్యాంకర్లు పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. గత 40 ఏళ్లుగా ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ అభ్యర్థులకు మంచి కోచింగ్‌తో పాటు.. సరైన మార్గదర్శకత్వం అందిస్తూ.. అనేక మందిని సివిల్స్ ఉన్నత ర్యాంకర్లను తయారు చేసిన సంస్థగా గుర్తిం పు పొందిన విషయం మీ అందరికి తెల్సిం దే. ఇదే తరుణంలో యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని..

సిలబస్‌కు అనుగుణంగా.. గత కొన్ని సంవత్సరాల యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నలు(పీవైక్యూఎస్), అలాగే ఈ ప్రశ్నలకు సంబం ధించిన వివరణాత్మక సమాధానాలను సరికొత్తగా అన్ని ఫార్మాట్లు పుస్తకాల రూపంలో స్టడీ సర్కిల్ తీసుకొచ్చింది. అలాగే అదనం గా, ఎంపిక చేసిన ప్రశ్నలకు క్యూఆర్ కోడ్ ఆధారిత వీడియో వివరణలు కూడా అందుబాటులో ఉంటుంది. తద్వారా.., అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ రాతపరీక్షలో శాస్త్రీయమైన,  సమర్థవంతమైన విధానంలో రాయ డానికి ఇవి ఎంతోగానే సహాయపడుతుంది.

కాగా యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు నా ణ్యమైన అధ్యయన వనరులను అందించాలనే ఒక బలమైన లక్ష్యంతో ఆర్సీ రెడ్డి ఐఏఎ స్ స్టడీ సర్కిల్ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఉన్నత ప్రమాణాల అ ధ్యయన సామగ్రి, పరీక్షా-ఆధారిత కంటెంట్, ఫలితాలపై దృష్టి సారించిన రివిజన్ కార్యక్రమాలు, సమగ్ర టెస్ట్ సిరీస్లు, వ్యక్తిగత మెంటార్‌షిప్ అందించాలనే సంస్థ సంకల్పానికి ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందన్నారు.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధిం చేందుకు అవసరమైన సాధనాలు, మార్గదర్శకత్వాన్ని అభ్యర్థులకు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న యూపీఎస్సీ అభ్యర్థులకు ఈ పుస్తకా లు అత్యంత విలువైన అధ్యయన వనరుగా ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా స మాధాన రచనా నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు, పరీక్షా విధానంపై లోతైన అవగాహన పెంపొందించడంలో ఈ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రా యపడ్డారు.