రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
10-03-2026 12:33 AM
ముకరంపుర, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గజ్జెల లక్ష్మ ణ్ మాదిగ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ద మ్మగల్ల లత మాదిగ, ఉపాధ్యక్షులు అంబాల రాజు మాదిగ, కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి మాదిగ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రా జబాబు మాదిగ, రామడుగు మండల అధ్యక్షులు దీకొండ రాకేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకురాలు నవ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.




