13 April, 2026 | 5:59 AM

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్

06-02-2026 01:26 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో మున్సి పల్ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాం ప్రసాద్ లాల్ గురువారం పరిశీలించారు. జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ లు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం తొర్రూరు మున్సిపాలిటీ కౌం టింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని క్షేత్రస్థా యి సిబ్బంది నుండి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రూల్స్ ను తప్పక పాటించాలని సూచించా రు. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర విభాగాల సిబ్బంది నిత్యం తనిఖీలు నిర్వ హించాలని ఆదేశించారు.