ఇచ్చిన మాటను జీవిత ఆశయంగా మల్చుకున్న స్త్రీ కథ
ఇచ్చిన మాటనే తన జీవితాశయంగా స్త్రీ కథే ‘ఋణానుబంధం’. ఈ సినిమా 1960 డిసెంబర్ 7వ తేదీన అంటే నేటి రోజున విడుదలైంది. వేదాం తం రాఘ వయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. అంజలి పిక్చర్స్ బ్యానర్‌పై పి. ఆదినారాయ ణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మి (అంజలీ దేవి) అనే ఒక అనాథ యువతికి సుబ్బన్న (గుమ్మడి) అనే వీధి రౌడీ ఆశ్రయమిచ్చి సొంత సోదరి లా చూసుకుంటాడు. అదే గ్రామంలో నివసిస్తున్న ప్రతాప్ రావు (సీఎస్‌ఆర్ ఆంజనేయులు) అనే జమీం దార్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌కు భయపడి, పట్టణంలో నివసించాలని నిర్ణయిం చుకుంటాడు.
ఈ క్రమంలోనే తన ఆస్తినంతా అమ్మి బంగా రం రూపంలో మార్చుకుంటాడు. దుర దృష్టవశాత్తు అదే రోజు రాత్రి జమీందార్ ఇంట్లో మంటలు చెలరేగడంతో జమీందార్ కుటుంబం ఆ మంటల్లో చిక్కుకుంటుంది. ప్రమాదంలో ఉన్న జమీందార్ భార్య కాంతం (నిర్మల మ్మ), కుమా రుడు రఘు (మాస్టర్ గోపి)లను లక్ష్మి రక్షిస్తుంది. జమీందార్‌ను మాత్రం లక్ష్మి కాపాడలేకపోతుంది. అయితే చనిపోయే ముం దు జమీందార్ తమ కొడుకు రఘును డాక్టర్‌ను చేయాలని కోరుతూ లక్ష్మి సమక్షంలో కాంతం నుంచి మాట తీసుకుంటాడు. ఆ తర్వాత జమీందార్ కో రికను నెరవేర్చేందుకు రఘును తీసుకుని లక్ష్మి పట్నానికి వెళుతుంది. అక్కడ ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చివరకు రఘును డాక్టర్ ను చేస్తుం దా? లేదా? వంటి ఆసక్తికర అం శాలతో ఈ సినిమా ముగుస్తుంది.






