30 June, 2026 | 9:02 PM

Breaking News

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •  

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం

31-05-2025 12:34 AM

-  కడ్తాల్ మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం 

- పాల్గొన్న డిలిమిటేషన్ చైర్మన్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్, మే 30 : కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డిలిమిటేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో ఎంబీఏ గార్డెన్ లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ  మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ముఖ్య అతిథులుగా డిలిమిటేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు శివసేన రెడ్డి, ధారాసింగ్ నాయక్  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే కల్వకుర్తిలో  కాంగ్రెస్ జెండా ఎగిరిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఆపదలో ఉంటే ఎప్పుడైనా తాను అం డగా ఉంటానన్నారు. జైబాపు జై బీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తోందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయని ఓ టివి ఛానల్ వార్త ప్లే చేసింది. కాని వారికి జర్నలిజంపై  అవగాహనా లేక వార్తలు పెడుతున్నారని కల్వకుర్తిలో ఎలాంటివి గ్రూపులు లేవని అంత ఒకటే కుటుంబమని అన్నారు.

అనంతరం కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల అధ్యక్షులు, ఆమనగల్లు బ్లాక్ అధ్యక్ష పదవి నియమానికి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, పోలీషన్ బోర్డు మెంబర్ బాలాజిసింగ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బీక్యా నాయక్, లక్పతి నాయక్, బీచ్యా నాయక్, చేగూరి వెంకటేష్, హన్మ నాయక్,  పోతుగంటి అశోక్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.