16 July, 2026 | 7:04 PM

గ్రహానికి ఆరు లక్షల కిలోమీటర్ల పొడవైన తోక

12-12-2024 12:29 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సౌరవ్యవస్థలో  ఓ గ్రహానికి ఉన్న ౬ లక్షల కిలో మీటర్ల పొడవైన తోకను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి నుంచి 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బృహస్పతి గ్రహానికి అతిధేయ నక్షత్రంగా ఉన్న ఎక్సోప్లానెట్ డబ్ల్యూఏఎస్‌పీౌ్69 బీ నుంచి వెలువడే తీవ్రమైన రేడియేషన్ కారణంగా ఈ తోక ఏర్పడినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డకోటా టైలర్ అనే ఖగోళ శాస్త్రవేత్త వెల్లడించారు.

ఈయన తన బృందంతో కలిసి చేసిన పరిశోధనా ఫలితాలను ‘ది ఆస్ట్రోఫిజికల్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. అందులో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బృహస్పతికి అత్యంత సమీపంలో పరిభ్రమించడం, కేవలం 3.9 రోజుల్లోనే గ్రహం చుట్టూ పరిభ్రమణం చెందడం వల్ల డబ్ల్యూఏఎస్‌పీ బీ నక్షత్రాన్ని వేడి బృహస్పతిగా పేర్కొంటారు. బృహస్పతి గ్రహం కేవలం సెకను కాలంలోనే 2 లక్షల టన్నులకు పైగా వాతావరణ నష్టాన్ని చవిచూస్తోంది.

నక్షత్ర వికిరణం.. గ్రహం బాహ్య వాతావరణాన్ని వేడి చేసినప్పుడు ఈ వాయువులను అంతరిక్షంలోకి తప్పించుకోడానికి అనుమతినిస్తోంది. ఈ విధమైన ప్రక్రియలో పొడవైన తోక ఏర్పడినట్లు డకోటా టైలర్ వెల్లడించారు.