పది ఫలితాలలో ఎమ్‌జీపీ గురుకుల విద్యార్ధుల ప్రతిభ
30-04-2026 01:50 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఎమ్ జి వి విద్యా సంస్థలలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది పరీక్షలకు మొత్తం 1743 మంది విద్యార్థులు హాజరు కాగా, 1739 మంది ఉత్తీర్ణత సాధించగా, 4 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 99.77% గా నమోదైంది. సిరిసిల్ల జిల్లాలో 100% ఫలితాలు సాధించగా, జగిత్యాల జిల్లాలో కూడా 100% ఫలితాలు నమోదయ్యాయి. అత్యధికంగా 585 మార్కులు సాధించిన విద్యార్థిని గల్ల రితిక (సిరిసిల్ల గరల్స్ స్కూల్) గా నిలిచింది. ఈ విద్యార్థిని వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి.






