సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఏ కోదండరాం
- మే11న కాచిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం
- తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఏ కోదండరాం అన్నా రు. ఏజెన్సీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసే విధంగా అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మే11 న హైదరాబాద్లోని కాచిగూడలోని ఓ హోటల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించ తలపెట్టిన కీలక రౌండ్ టేబుల్ సమా వేశంకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఔ ట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమహమ్మద్, నాయకులు బాలకృష్ణారెడ్డి, క్రాం తిలు మాట్లాడుతూ మే 11న కాచిగూడ లోని అభినందన్ హోటల్లో నిర్వహించే ఈ సమావేశం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సో ర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడం ప్రధాన లక్ష్యమని తెలి పారు.
అలాగే మే 25న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని సమస్యలపై సారించనున్నట్లు తెలిపారు.






